పాక్ వ్యక్తిని పెళ్లాడిన నిజామాబాద్ మహిళకు భారత్ పౌరసత్వం ఇచ్చిన సర్కారు
- June 20, 2018
నిజామాబాద్:పాకిస్థాన్ దేశీయుడిని పెళ్లాడిన నిజామాబాద్ మహిళ, ఆమె ముగ్గురు కుమారులకు ఎట్టకేలకు భారత పౌరసత్వం లభించింది. పాక్ పౌరసత్వం ఉన్న మహిళ, ఆమె కుమారులకు భారత పౌరసత్వం ఇవ్వడం పట్ల బీజేపీ నేతలు నిరసన తెలపడంతో ఈ వ్యవహారం వార్తల్లోకెక్కింది.నిజామాబాద్ నగరానికి చెందిన ఫైజున్సీసా (45) 1988లో పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్సు బాహ్వాలాపూర్ పట్టణ నివాసి ముహమ్మద్ అబ్దుల్ నదీంజావీద్ ను పెళ్లి చేసుకొని పాకిస్థాన్ వెళ్లిపోయింది.ఫైజున్సీసాకు ముహమ్మద్ సనన్(29), రుమాన్ (27), సైఫ్ (25) లనే ముగ్గురు కుమారులు పుట్టాక భర్తతో విడాకులు తీసుకొని 2004లో దీర్ఘకాలిక వీసాపై స్వదేశానికి తిరిగివచ్చింది. అప్పటినుంచి నిజామాబాద్ పాత నగరంలో పాఠశాల నిర్వహిస్తూ ఫైజున్సీసా తన కుమారులతో కలిసి ఇక్కడే నివాసముంటోంది. ఫైజున్సీసాతో పాటు ఆమె కుమారులు 8 ఏళ్ల క్రితం భారత పౌరసత్వం ఇవ్వాలని దరఖాస్తు చేసుకోగా ఎట్టకేలకు సర్కారు వారికి భారత్ పౌరసత్వం ఇచ్చింది. పాక్ పౌరులకు భారత్ పౌరసత్వం ఎలా ఇస్తారని బీజేపీ నాయకులు నిరసన తెలిపారు.ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







