ఫేక్ బిజినెస్ అడ్వర్టయిజ్మెంట్: వ్యక్తికి జైలు, జరీమానా
- June 21, 2018
మస్కట్:ఫేక్ బిజినెస్ అడ్వర్టయిజ్మెంట్ అభియోగాల నేపథ్యంలో ఓ వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష, 550 ఒమన్ రియాల్స్ జరీమానా విధించడం జరిగింది. కన్స్యూమర్ వాచ్ డాగ్ ఈ విషయాన్ని వెల్లడించింది. పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ (పిఎసిపి) వెల్లడించిన వివరాల ప్రకారం నిందితుడు, ఓ వెబ్సైట్లో ఫేక్ అడ్వర్టయిజ్‌మెంట్‌ని పొందుపరిచాడు. ఈ అడ్వర్టయిజ్మెంట్లో, ఫిలిప్పినో డొమెస్టిక్ వర్కర్స్‌కి సహాయం చేస్తానని పేర్కొనడం జరిగింది. ఈ ప్రకటన చూసి 1,200 ఒమన్ రియాల్స్ చెల్లించిన ఓ వ్యక్తి, ఎంతకాలమైనా తనకు కోరుకున్న ఉద్యోగం రాకపోవడంతో కన్స్యుమర్ ప్రొటెక్షన్ అడ్మినిస్ట్రేషన్ (బురైమీ)ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసి, నిందితుడిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించగా, న్యాయస్థానం నిందితుడికి జైలు శిక్ష, జరీమానాతోపాటుగా, బాధితుడికి 1,350 ఒమన్ రియాల్స్ చెల్లించాల్సిందిగా ఆదేశించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..