తెలంగాణ:విదేశాల్లో విద్య కోసం దరఖాస్తుల స్వీకరణ
- June 21, 2018
హైదరాబాద్: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఇండో అమెరికన్ స్టడీస్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఉషశ్రీ తెలిపారు. హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇంజినీరింగ్, ఆర్ట్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఇతర మాస్టర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందే విద్యార్థులు ఏడాది కాలంలోనే ఈ కోర్సులను పూర్తి చేయడంతోపాటు స్కాలర్షిప్ పొందవచ్చని తెలిపారు. అండర్ గ్రాడ్యుయేషన్ , మెడిసిన్, ఇంజినీరింగ్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులకు ఇంటర్, డిప్లొమా పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. తెలంగాణ నుంచి అమెరికాకు ఉన్నత విద్యనభ్య సించడానికి వెళ్లే విద్యార్థులకు వసతి, వీసా, ఫీజు ఇతరత్ర వాటికి అయ్యే ఖర్చులో 50 శాతం రాయితీ కల్పించనున్నట్లు ఆమె తెలిపారు. వివరాల కోసం 9246522065, [email protected]లో సంప్రదించాలని ఉషశ్రీ సూచించారు.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా