అఖిల్ కొత్త సినెమా ప్లేబాయ్ షూటింగ్ షురూ
- June 22, 2018
ఇండస్ట్రీలో జయాపజయాలు అనేవి సహజం..ఎంత పెద్ద స్టార్ హీరో అయినా..ఒక్కోసారి ఘోరమైన పరాజయాన్ని పొందవొచ్చు..ఎలాంటి అంచనాలు లేని చిత్రం సూపర్ డూపర్ హిట్ కావొచ్చు. తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అక్కినేని అఖిల్. మొదటి చిత్రం వివివినాయక్ దర్శకత్వంలో 'అఖిల్'తో ఎంట్రీ ఇచ్చాడు..నటన పరంగా మనోడికి మంచి మార్కులు పడ్డా కమర్షియల్ గా హిట్ కాలేదు.తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'హాలో'తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు..చిత్రం మంచి హిట్ టాక్ వచ్చినా..కలెక్షన్ల పరంగా తుస్ మంది. అక్కినేని హీరో అఖిల్ తన మూడో మూవీని ప్రారంభించాడు.. ఈ మూవీకి వెంకీ అట్లూరి దర్శకుడు.. నిధి అగర్వాల్ హీరోయిన్. ఈ మూవీ షూటింగ్ లండన్ లో ప్రారంభమైంది
రెండు నెలల పాటు లండన్ లోనే షూటింగ్ జరుపుకోనుంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో అఖిల్ ప్లే బాయ్ గా కనిపించనున్నాడు.. ఈ షూటింగ్ స్పాట్ ఫోటోను చిత్ర యూనిట్ షేర్ చేసింది.. ఈ ఫోటోలో అఖిల్, హీరోయిన్ నిధి అగర్వాల్, దర్శకుడు వెంకీ అట్లూరి ఉన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..