శ్రీవిష్ణు కొత్త చిత్రం ప్రారంభం..
- June 23, 2018
యువ హీరో శ్రీవిష్ణు కొత్త సినిమా చిత్రీకరణ మొదలైంది. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగిన చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్, కృష్ణ విజయ్ ఎల్ ప్రొడక్షన్స్, శ్రీ ఓం సినిమా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కృష్ణ విజయ్ ఎల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశ చిత్రీకరణ అనంతరం దర్శకుడు కృష్ణ విజయ్ మాట్లాడుతూ.శ్రీ విష్ణుతో మరో చిత్రాన్ని చేయడం సంతోషంగా ఉంది. అప్పట్లో ఒకడుండేవాడు, నీదినాదీ ఒకే కథ సినిమాల నిర్మాణంలో భాగమయ్యాం. ఇప్పుడీ చిత్రానికి నిర్మాణంతో పాటు దర్శకత్వం వహిస్తున్నాము. జూలై నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం. మూడు నెలలు వరుసగా షెడ్యూల్ ఉంటుంది. ఏడాది చివరలో సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. అన్నారు. హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ..ఈ సినిమాకు ఎవరం కొత్త వాళ్లం కాదు. మేమంతా కలిసి పనిచేస్తూనే ఉన్నాం. విజయ్ గారితో మళ్లి పనిచేస్తున్నాను. అందరికీ నచ్చే సినిమా అవుతుందని భావిస్తున్నా. అన్నారు. నిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ.ఇప్పటిదాకా సినిమాలను చూడటమే కానీ నిర్మాణ రంగంలోకి రాలేదు. విజయ్ ఈ కథ చెప్పినప్పుడు వెంటనే చిత్రీకరణకు వెళ్దాం అన్నంతగా నచ్చింది. అయితే విజయ్ కథను పక్కాగా సిద్ధం చేసుకుని వచ్చారు. చాలా కొత్త అనుభూతిని ప్రేక్షకులకు పంచే సినిమా అవుతుంది. అందుకు యూనిట్ అంతా కష్టపడుతున్నారు అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం - సురేష్ బొబ్బిలి, సినిమాటోగ్రఫీ - సిద్, ఎడిటర్ - ధర్మేంద్ర కాకర్ల, ఆర్ట్ డైరక్టర్ - మురళి
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!