ఖతార్: కష్టాల్లో అండగా నిలిచిన తెలంగాణ జాగృతి
- June 23, 2018
దోహా:ఖతార్లో తినడానికి తిండి లేక ఉండడానికి నీడ లేక తీవ్ర అవస్థలు పడుతున్న కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన 20 మంది బాధితులకు స్థానిక తెలంగాణా జాగృతి చేయూత నిచ్చింది. బాధితుల గురించి తెలుసుకున్న జాగృతి ఖతర్ నిర్వాహకురాలు నందిని అబ్బాగౌని వారిని కలిసి మాట్లాడారు. వారి బాధలు ప్రత్యక్షంగా చూసిన ఆమె తక్షణం స్పందించి వారానికి సరిపడా ఆహార పదార్థాలను సమకూర్చారు. బాధితులంతా ఏజెంట్ల మోసాలకు గురైనవారుగా సమాచారం. చేయడానికి పనిలేక, ఉండటానికి ఇళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరికి వీసా గడువు ముగిసింది. మరికొందరికి ఎగ్జిట్ పర్మిట్ లేదు. కొందరికి ఐడీ చెయ్యమంటే ఏజెంట్లు ఇంకా పైసలు అడుగడంతో ఖర్చులకు రూపాయి లేక.. ఇంటికి ఫోన్ చేయలేక సతమతమౌతున్నారు. జాగృతి ఖతర్ నాయకులు నందిని అబ్బగౌని, ప్రణీత కేతే, అశ్వినీ కోఠి, అనుపమ సంగిశెట్టి బాధితులకు ధైర్యం చెప్పారు. అక్కడి యాజమాన్యంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని చెప్పారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్,ప్రతినిధి)
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..