షికాగో సెక్స్ రాకెట్ దెబ్బ..నటీమణులకు భారీ ట్విస్ట్..
- June 23, 2018
షికాగో సెక్స్ రాకెట్ కారణంగా అక్కడ జరిగే సభలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే కొంతమంది సినీనటులకు వీసాలు నిరాకరిస్తున్నారు యూఎస్ కాన్సులేట్ అధికారులు. ఇటీవల అమెరికాలో వెలుగుచూసిన సెక్స్ రాకెట్ ఘటన కారణంగా తాత్కలికంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అమెరికాలో జరిగే తానా, ఆటా, నాటా సదస్సులకు ఆహ్వానం అందడంతో ఇటీవల కొందరు ఆర్టిస్టులు యూఎస్ కాన్సులేట్‌లో బీ1బీ2 వీసా ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అయితే వారి వీసాలు తిరస్కరణకు గురయ్యాయి. దాదాపు 60 శాతం నుంచి 75 శాతం మందికి వారి ఆర్థిక పరిస్థితిని బట్టి వీసాలు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ సదస్సులకు వెళతామని అంటున్న వారికి ఏ ప్రశ్నలూ లేకుండానే వీసా తిరస్కరిస్తున్నారు యూఎస్ కాన్సులేట్ అధికారులు. దీనికి కారణం అడిగితే మాత్రం వారు చెప్పడానికి నిరాకరిస్తున్నారని బాధితులు అంటున్నారు.
కాగా అమెరికాలో జరగబోయే సదస్సుకు తెలంగాణ రాష్ట్రం నుంచి 24 మంది అమెరికాకు రావడానికి అనుమతించాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఓ సిపారసు లేఖ యూఎస్ కాన్సులేట్ కు చేరింది. అయితే అనూహ్యంగా వారిలో కేవలం నలుగుర్ని మాత్రమే అనుమతించారు. మిగిలిన దరఖాస్తులను తిరస్కరించారు. ఇక వీరి పరిస్థితే ఇలా ఉంటే కొందరు సినిమా నటీమణుల పరిస్థితి మరోలా ఉంది. త్వరలో జరగబోయే మహాసభలకు చాలా మంది సినిమా ఆర్టిస్టులు విసాలకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ అందులో 75 శాతం వీసాలు తిరస్కరణకు గురవవుతున్నాయని ఆర్టిస్ట్ సురేఖారాణి తెలిపారు. కేవలం మహాసభల పేరుతో వెళ్లేవారి వీసాలను వారు తిరష్కరిస్తున్నారని ఆమె వాపోయారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..