ఇండిగో ఛార్జీల మోత

- June 23, 2018 , by Maagulf
ఇండిగో ఛార్జీల మోత

చౌక ధర విమానయాన సంస్థ ఇండిగో అదనపు లగేజీ ఛార్జీలను భారీగా పెంచింది. 15 కేజీలు దాటిన అదనపు లగేజీపై ఏకంగా 33 ఛార్జీని పెంచుతున్నట్లు ఇండిగో ప్రకటించింది. ప్రి బుకింగ్‌ చేసుకున్న వారికి ప్రస్తుతం 5 కేజీలపై రూ.1900, 10 కేజీల పై రూ.3800, 15 కిలోలపై రూ.5700, 30 కిలోలపై రూ.11,400 ఛార్జీని వసూలు చేస్తోంది ఇండిగో. అయితే ఎవరైతే ప్రీ బుకింగ్‌ చేసుకోకుండా 15 కేజీలకు అదనంగా లగేజీని కలిగి ఉంటే ప్రస్తుతం కేజీకి రూ.400 వసూలు చేస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో నిర్ణీత లగేజీ పరిమితి దాటితే విమానయాన సంస్థలు తమకు నచ్చిన రీతిలో ఛార్జీలను వసూలు చేసుకోవచ్చని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో అదనపు లగేజీపై ఛార్జీలను పెంచుతున్నట్లు ఇండిగో వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com