యోగా గురువు ఫొటో షేర్ చేశాడు.. బుక్ అయ్యాడు
- June 24, 2018
ప్రముఖ సెలబ్రెటిలా ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్ట్ చేస్తున్నారు కొందరూ అకతాయిలు. తాజాగా ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ మార్ఫింగ్ ఫొటోను సోషల్ మీడియాలో ఓ వ్యక్తి షేర్ చేశాడు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఓ వాట్సాప్ గ్రూప్‌లో బాబా రాందేవ్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్న ఫొటోను రహిషుద్దీన్ అనే వ్యక్తి షేర్ చేశాడు. దీనిపై ఆగ్రహించిన కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐటీ చట్టం ప్రకారం రహిషుద్దీన్‌పై కేసు నమోదు చేసిన నోయిడా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. తన ఫ్రెండ్ పంపడంతోనే తను ఈ ఫొటోను షేర్ చేశానని నిందుతుడు పోలీసుల ముందు వాపోయాడు.
మార్ఫింగ్ ఫొటోతో బాబా రాందేవ్‌ను కించపరిచేలా యత్నించిన వ్యక్తిని అరెస్ట్ చేసినందుకు నోయిడా పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు పతాంజలి ఆయుర్వేద సంస్థ ఎండీ బాలకృష్ణ.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..