బిగ్‌బాస్ 2కు షాక్!
- June 24, 2018
రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతోన్న తమిళంలో బిగ్‌బాస్2షోకు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఫెఫ్సీ) షాకిచ్చింది. ఫెఫ్సీ సంఘం సూచనల మేరకు సినీ సంఘాలన్ని కూడా పనిచేస్తుంటాయి. బిగ్ బాస్ షోకు తమిళ చిత్రసీమకు చెందిన 75 శాతం కార్మికులను వినియోగించాలనే ఒప్పందం ఉంది. ఈ షోకు పనిచేసే కార్మికులలో 75 శాతం మంది ఫెఫ్సీ సభ్యులై ఉండాలన్న నిబంధనను షో నిర్వహకులు ఉల్లంగించి, కార్మికులను మోసం చేస్తున్నారని ఆరోపించింది. వెంటనే చర్చలు తీసుకోకుంటే బిగ్ బాస్ షోను బహిష్కరిస్తామని హెచ్చిరించింది. అంతేకాదు బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కమల్ హాసన్‌ను కూడా ఫెఫ్సీ హెచ్చరించింది.
ఇది ఇలా ఉంటే కమల్‌హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో తమిళ టీవీ వీక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. రెండో సీజన్ మొదలైన దగ్గరనుంచి చిత్ర విచిత్రమైన పనులతో కంటెస్టెంట్లు కూడా ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా హౌస్మేట్స్ అయిన జనని, ఐశ్వర్యల మధ్య లిప్‌లాక్ యుద్ధం శుక్రవారం నాటి ఎపిసోడ్‌లోనే హైలెట్‌గా నిలిచింది.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!