ఉగ్రవాద సంస్థకు భారీ దెబ్బ
- June 24, 2018
భారత భద్రతాదళాలు.. లష్కరే తొయబా ఉగ్రవాద సంస్థను భారీగా దెబ్బతీశాయి. కుల్గాంలో జరిగిన ఎన్కౌంటర్లో భారత బలగాలు ఇద్దరు లష్కరే ఉగ్రవాదులను కాల్చిచంపగా, వీరిలో ఒకరిని లష్కరే తొయిబా కమాండర్ షకూర్గా గుర్తించినట్టు సమాచారం. 2015 నుంచి కశ్మీర్లో చురుకుగా పనిచేస్తున్న షకూర్ రాష్ట్రంలో పలు ఉగ్రవాద దాడుల ప్రధాన సూత్రధారిగా ఉన్నట్టు ఉన్నతాధికార వర్గాల సమాచారం.
దక్షిణ కశ్మీర్లోని కుల్గాంలో మధ్యాహ్నం ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. చద్దర్ ప్రాంతంలో గస్తీ బృందంపై ఉగ్రవాదులు దాడిచేయడంతో భధ్రతా దళాలు ఎదురుదాడికి దిగాయి. ఎన్కౌంటర్ కారణంగా కుల్గాం జిల్లాలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అమర్నాథ్ యాత్రకు వెళ్లే రహదారిలో కుల్గాం ఉండడంతో.. భద్రతాదళాలు ఇంకాస్త అప్రమత్తమయ్యాయి.
మొదట కుల్గాం ప్రాంతంలో మొత్తం ముగ్గరు ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారం భద్రతా దళాలకు చేరింది. దీంతో ఉదయం 1 రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్, సీఆర్పీఎఫ్, జమ్ముకశ్మీర్ పోలీసులకు చెందిన ఎస్వోజీ బృందాలు రంగంలోకి దిగాయి. కుల్గాం జిల్లాలోని క్యూమోహ్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టాయి. ఈ ఎన్కౌంటర్లోనే లష్కరేకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా.. మూడో ఉగ్రవాది ఆయుధాలు, మందుగుండు సామగ్రితో సహా లొంగిపోయాడు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







