ఐఫా-2018 విజేతల లిస్ట్

- June 24, 2018 , by Maagulf
ఐఫా-2018 విజేతల లిస్ట్

ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌(ఐఫా) వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్యాంకాక్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఈ వేడుకలకు అతిరధ మహారధులు హాజరై , ఈ కార్యక్రమాన్ని రంజిపచేసారు. కరణ్‌జోహార్‌, నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌ ఈ కార్య క్రమానికి హోస్ట్ గా వ్యవహరించడం జరిగింది. దివంగత నటి శ్రీదేవి 'మామ్' చిత్రానికిగాను ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఆమె తరఫున భర్త బోనీ కపూర్‌ ఈ అవార్డును అందుకొని , స్టేజ్ ఫై మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు.

అలాగే 'హిందీ మీడియమ్‌' సినిమాకు గాను బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ఖాన్‌కు ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. ప్రస్తుతం ఇర్ఫాన్‌ అనారోగ్యంతో లండన్‌లో చికిత్స తీసుకుంటుండంతో ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. ఇటీవల కన్నుమూసిన ప్రముఖ నటులు శ్రీదేవి, వినోద్‌ ఖన్నా, శశికపూర్‌కు ఐఫా ఘనంగా నివాళులు అర్పించింది.

ఇక 2018 ఐఫా విజేతల లిస్ట్ ఈ విధంగా ఉంది..

ఉత్తమ చిత్రం : తుమ్హారి సులు

ఉత్తమ నటుడు : ఇర్ఫాన్‌ ఖాన్‌(హిందీ మీడియం)

ఉత్తమ నటి : శ్రీదేవి(మామ్‌)

ఔట్‌స్టాండింగ్‌ అచివ్‌మెంట్‌ అవార్డు : అనుపమ్‌ ఖేర్‌

ఉత్తమ దర్శకుడు : సాకేత్‌ చౌదరి(హిందీ మీడియం)

ఉత్తమ కథ : న్యూటన్‌

ఉత్తమ సహాయ నటుడు : నవాజుద్దీన్‌ సిద్దిఖీ(మామ్‌)

ఉత్తమ సహాయన నటి : మెహర్‌ విజ్‌ (సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌)

ఉత్తమ సంగీత దర్శకుడు :అమాల్‌మాలిక్‌, తనిష్క్‌ బగ్చీ, అఖిల సచ్‌దేవ(బద్రీనాథ్‌కి దుల్హనియా)

ఉత్తమ గాయని :మెఘనా మిశ్రా(జగ్గా జాసూస్‌)

ఉత్తమ గాయకుడు : అర్జిత్‌ సింగ్‌ (జబ్‌ హ్యారీ మెట్‌ సెజల్‌)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com