'గోల్డ్' సినిమా ట్రైలర్ అంచనాలు పెంచేసింది!
- June 25, 2018
గత కొంత కాలంగా సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ చిత్రాల జోరు బాగా పెరిగిపోయింది. 1948 లండన్ ఒలంపిక్స్‌లో భారత్ హకీలో గోల్డ్ పతాకం సాధించటం అన్న నేపథ్యంతో(కల్పిత గాథ) రీమా ఖగ్టీ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రమే 'గోల్డ్'. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్ర టీజర్ కాసేపటి క్రితం విడుదల అయ్యింది. 2:18నిమిషాల పాటు కొనసాగిన 'గోల్డ్' ట్రైలర్, పేరుకు తగినట్లుగానే బంగారం లాంటి సినిమా అనిపిస్తుంది. రెండు నిమిషాల ట్రైలర్లోనే ఈ ఖిలాడీ హీరో దేశభక్తితో పాటు క్రీడల పట్ల తన ప్రేమను ఏక కాలంలోఅద్భుతంగా ప్రదర్శించాడు.
బుల్లితెర ధారవాహిక 'నాగిని' ఫేం మౌనీ రాయ్ అక్షయ్‌ను బెంగాలీలో తిడుతూ ఓ 5 సెకన్ల పాటు కనిపించింది. ఈ చిత్రంలో అక్షయ్‌కు జోడిగా మౌనీరాయ్ నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కునాల్ కపూర్, అమిత్ సాద్, వినీత్ కుమార్ సింగ్, సన్నీ కౌశ్ల్ల పాత్రల పరిచయం ఉంటుందిం. వీరందరిని దేశం తరుపున హాకీ ఆడే ఆటగాళ్లుగా పరిచయం చేస్తూ ట్రైలర్ కొనసాగింది.
ఈ చిత్రంలో అక్షయ్ స్వతంత్ర భారతావని తరుపున ఒలంపిక్‌లో గోల్డ్ మెడల్ సాధించే హాకీ జట్టు కోచ్ 'తపం దాస్' పాత్రలో కనిపించనున్నారు. అక్షయ్ కుమార్, మౌనీ రాయ్, అమిత్ సద్, వినీత్ సింగ్, సంగీత్ కౌశల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. రితేశ్ సిద్వానీ, ఫరాన్ అక్తర్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'గోల్డ్' ఆగష్టు 15 2018న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!