'తేజ్ ఐ లవ్ యూ' సినిమా టీజర్ రిలీజ్
- June 25, 2018
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో కరుణాకరన్ తెరకెక్కిస్తున్న చిత్రం తేజ్ ఐ లవ్ యూ. చిత్రంలో అనుపమ కథానాయికగా నటించింది. జూలై 6న విడుదల కానున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. అందమైన ప్రేమ కథా చిత్రంగా రూపొందిన తేజ్ ఐ లవ్ యూ చిత్ర పోస్టర్స్ , టీజర్స్, పాటలు ప్రేక్షకులలో అంచనాలు పెంచాయి. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్. రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రం కవితాత్మక భావనలతో సాగే ప్రేమ కథాచిత్రంగా ఉంటుందని సమాచారం. ఇందులో సాయిధరమ్ తేజ్ నవతరం ప్రేమికుడిగా కనిపించనున్నాడు. అనుపమ పరమేశ్వరన్ మెమోరీ లాస్ పేషెంట్‌గా కనిపించనుందనే టాక్ . తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఇందులోని సన్నివేశాలు సినీ ప్రేక్షకులకి అమితానందాన్ని కలిగిస్తున్నాయి. ఈ చిత్రం తేజూకి తప్పక హిట్ ఇస్తుందని అంటున్నారు. మరి తాజాగా విడుదలైన ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







