పవన్‌ సొంత మీడియా ఛానల్ రెడీ..

- June 25, 2018 , by Maagulf
పవన్‌ సొంత మీడియా ఛానల్ రెడీ..

తమకు తగినంత ప్రచారం దక్కాలని రాజకీయ నాయకులు కోరుకోవడంలో తప్పులేదు. ఏం చేసినా చేయకపోయినా అనుకూల మీడియాలో ఎనలేనంత ప్రచారం దొరకుతూనే ఉంటుంది. మరి రాజకీయాల్లో కొత్తగా వచ్చిన వారికి ఈ అవకాశం ఉండకపోవచ్చు! అందుకే సొంతంగా ప్రచారం నిర్వహించుకునేందుకు ఒక చానల్‌ను ప్రారంభిచడమో లేక సంస్థనో అద్దెకు తీసుకుంటారు! ప్రస్తుతం జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఇదే పద్ధతి ఫాలో అయిపోతు న్నారు. మొదట్లో మీడియా ఆయనపై చూపినంత ఫోకస్‌.. ఇప్పుడు లేదని గ్రహించిన పవన్‌.. ఇక ఎవరిమీదా ఆధారప డకూడదని భావించినట్లున్నాడు! అందుకే తనకంటూ సొంతంగా చానల్ కావాలని నిర్ణయించుకున్నాడట. ఇప్పటికి ప్పుడు సంస్థ ప్రారంభించడమ కష్టమని తెలుసుకుని.. మిత్రులైన కమ్యూనిస్టుల చానల్‌ను అద్దెకు తీసుకున్నాడట. సంస్థ అప్పుల్లో ఉంటే దానికి ఆర్థిక సాయం చేసి మరీ.. నిలబెట్టాడట.!
కమ్యూనిస్టులనే కాదు.. వాళ్ల చానల్‌ను కూడా పవన్ ఫుల్లుగా వాడేసుకుందామని డిసైడ్ అయిపోయాడట. పవన్ తొలి నుంచి కమ్యూనిస్టులతోనే ఎక్కువ సావాసం చేస్తున్నాడు. సీపీఐ, సీపీఎం పార్టీల నాయకులు కూడా పవన్ వెంటే నడుస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో వాళ్లతో కలసి పవన్‌ పోటీచేస్తారని అంతా భావిస్తున్నారు. ఈ సమయంలో తమకు ప్రచారం కల్పిచేందుకు మీడియా సంస్థలు వెనకడుగు వేస్తున్నాయని పవన్ గ్రహించాడట. ముఖ్యంగా సీఎం చంద్రబాబుతో విభేదించిన తర్వాత మీడియాలో జనసేనకు ఇస్తున్న ప్రయారిటీకి, అంతకు ముందు ఇచ్చిన ప్రయారిటీని బేరీజు వేసుకుంటే అనూహ్య మార్పులే వచ్చిన విషయం తెలిసిందే! చంద్రబాబుకు మద్దతు పలుకుతున్నంతసేపూ కొన్ని టీవీ చానళ్లు పవన్ కల్యాణ్ వార్తలను తెగ ప్రసారం చేశాయి. ఎప్పుడైతే పవన్ కల్యాణ్ చంద్రబాబుకు దూరం అయ్యాడో అక్కడ నుంచి ఆ చానళ్ల తీరు మారిపోయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com