ఒమన్‌లో ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ ఎమర్జన్సీ ల్యాండింగ్
- June 26, 2018
ఒమన్:మెడికల్ ఎమర్జన్సీ కారణంగా ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ మస్కట్‌లో ఎమర్జన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఢిల్లీ నుంచి దుబాయ్ వెళుతున్న విమానం, మెడికల్ ఎమర్జన్సీ కారణంగా అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందని ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రతినిథి వెల్లడించారు. ముందస్తుగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి సమాచారమిచ్చిన ఎయిర్ క్రాఫ్ట్ క్రూ, అంబులెన్స్ కోసం రిక్వెస్ట్ చేశారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే, వైద్య సిబ్బంది ప్రయాణీకుడ్ని పరీక్షించారు. ప్రయాణీకుడి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే వుందనీ, ప్రయాణానికి ఇబ్బందులేమీ లేవని వైద్యులు ధృవీకరించడంతో విమానాన్ని దుబాయ్‌కి పంపించారు. ప్రయాణీకుడికి శ్వాస కోశ సమస్యలు తలెత్తడంతో విమానాన్ని అత్యవసరంగా కిందికి దించాల్సి వచ్చిందని ఇండిగో ప్రకటించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..