సూర్య తో కలిసి నటించనున్న జగ్గు భాయ్.!
- June 27, 2018
జగపతిబాబు క్యారెక్టర్ రోల్స్ చేయడం స్టార్ట్ చేశాక అతని జీవితం మారిపోయిందనే చెప్పాలి. గతంలో ఆయన హీరోగానే సినిమాలు చేసేవాడు కానీ ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ చేయడం వల్ల సౌత్ లోనే అత్యధిక డిమాండ్ ఉన్న నటుల్లో ఒకడిగా ఎదిగాడు. తెలుగులోనే కాకుండా తమిళం..మళయాళం లాంటి భాషల్లో సినిమాలు చేస్తూ సాగుతున్నాడు జగపతి. తెలుగులో జగపతిబాబుకి ఎంత గుర్తింపుందో అంతే తమిళంలో కూడా ఉంది. తమిళంలో స్టార్ హీరో విజయ్ పక్కన విలన్ గా చేసాడు ఆయన. మళ్లీ ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో కీలక పాత్ర దక్కించుకున్నాడు. సూర్య - విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'ఎన్జీకే' సినిమాలో జగపతి బాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో నెగటివ్ రోల్ అని తెలుస్తుంది.
సెల్వ సినిమాలంటే ప్రతి పాత్రకూ ప్రాధాన్యముంటుంది. చాలా టిపికల్‌గా ఉంటాయి అతడి సినిమాల్లోని పాత్రలు. హీరో సూర్య పాత్ర కూడా ఇందులో చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇక ఇందులో రకుల్ ప్రీత్.. సాయిపల్లవి కథానాయికలుగా నటిస్తున్నారు. సాయి పల్లవి సూర్యతో నటించాలనే కోరిక ఈ సినిమాతో తీరనుంది.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!