డ్రగ్స్‌ స్మగ్లింగ్‌: వలసదారుడి అరెస్ట్‌

- June 27, 2018 , by Maagulf
డ్రగ్స్‌ స్మగ్లింగ్‌: వలసదారుడి అరెస్ట్‌

బంగ్లాదేశీ వ్యక్తి, నార్కోటిక్‌ పిల్స్‌, డ్రగ్స్‌ని బహ్రెయిన్‌లోకి స్మగ్లింగ్‌ చేస్తుండగా, ఎయిర్‌పోర్ట్‌లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. డాల్‌ మీల్‌, చికెన్‌ బ్రోత్‌లో నిందితుడు డ్రగ్స్‌ని దాచి, తరలించేందుకు ప్రయత్నించాడు. బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన విమానంలో నిందితుడు ఈ డ్రగ్స్‌ని తీసుకురాగా, బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేరానికి పాల్పడేందుకుగాను, బంగ్లాదేశీ ఒకరు నిందితుడికి 200 బహ్రెయినీ దినార్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో తదుపరి విచారణ సెప్టెంబర్‌ 12వ తేదీకి వాయిదా పడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com