మరో డబల్ యాక్షన్ తో రానున్న మాస్ మహారాజా
- June 27, 2018
బెంగాల్ టైగర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రవితేజ ఈ మధ్య సినిమాల స్పీడ్ పెంచాడు. వరుసగా రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంటోని చిత్రం చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రంతో ఇలియానా టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇస్తుంది. దసరా కానుకగా మూవీ విడుదల కానుంది. ఇక ఈ సినిమా తర్వాత 'ఎక్కడికి పోతావు చిన్నవాడా , ఒక్క క్షణం 'చిత్రాల దర్శకుడు వి . ఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు రవితేజ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి డిస్కో రాజా అనే టైటిల్ పరిశీలనలో ఉండగా, ఇందులో ద్విపాత్రిభినయం పోషించనున్నాడట మాస్ రాజా. అందులో ఒకటి కొడుకు పాత్ర కాగా మరొకటి తండ్రి పాత్ర అని తెలుస్తుంది . రవితేజ గతంలో విక్రమార్కుడు , కిక్ 2 చిత్రాల్లో రెండు పాత్రల్లో నటించారు. మరి డిస్కోరాజా చిత్రంలో డ్యూయల్ పాత్రలో కనిపించి ఎలా అలరిస్తాడో చూడాలి.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!