భారీ బడ్జెట్ దిశగా సైరా

- June 27, 2018 , by Maagulf
భారీ బడ్జెట్ దిశగా సైరా

ఓ పక్క హీరోగా వరుస సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా రాణిస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం ఈయన హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం లో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. దీంతో పాటు నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా మూవీ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది.

ఇందులో కీలకమైన యుద్ధ సన్నివేశాలను, అది కూడా నైట్ ఎఫెక్ట్స్ లో రూపొందిస్తున్నారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రఫర్స్, ఫైటర్స్ ఈ షెడ్యూల్ కోసం పనిచేస్తున్నారు. సినిమాలోనే అత్యంత ఖరీదైన ఈ షెడ్యూల్ కోసం చరణ్ రూ.40 కోట్లను ఖర్చు చేస్తున్నారు. కాగా సినిమా మొత్తం బడ్జెట్ రూ.200 కోట్ల వరకు ఉండనుందని అంటున్నారు. ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, నయనతారలు, జగపతి బాబు , తమన్నా మొదలగు నటి నటులు నటిస్తున్నారు. తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com