రైతుల కష్టాల ఫై మహేష్ సినిమా.!
- June 27, 2018
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటే నాల్గు పాటలు , లవ్ , యాక్షన్ మాత్రమే కాదు సామజిక అంశాలు ఉండేలా చూసుకుంటాడు. ఇటీవల వచ్చిన శ్రీమంతుడు ,స్పైడర్ , భరత్ అనే నేను చిత్రాల్లో ప్రజల కష్టాలను గురించి తెలియసాడు. తాజాగా ఇప్పుడు చేస్తున్న తన 25 వ చిత్రం లోను సామాజిక సమస్యల్ని ప్రస్తావిస్తునట్లు ఫిలిం నగర్ లో ప్రచారం అవుతుంది.
వంశీ పైడిపల్లి దర్శకత్వం లో చేస్తున్న ఈ మూవీ లో తెలుగు రాష్ట్రాల్లోని రైతుల సమస్యలను, కష్టాలను గురించి చూపించబోతున్నారట. ముఖ్యంగా రైతుల రుణాలు, వాళ్ళ బీద పరిస్థితులను ప్రదానం చేసుకొని డైరెక్టర్ కథ రాసినట్లు, అలాగే సినిమా రైతుల్లో కొత్త ఉత్తేజం నింపే తరహాలో ఉండబోతుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీ డెహ్రాడూన్ లో షూటింగ్ జరుపుకుంటుంది. హీరోయిన్ పూజా హగ్దే , మహేష్ బాబు లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట.
ఈ షెడ్యూల్ పూర్తి కాగానే అమెరికా లో మరో షెడ్యూల్ జరపనున్నారు. దాని తర్వాత హైదరాబాద్ షెడ్యూల్ తో సినిమా పూర్తి అవుతుందని తెలుస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి విడుదలయ్యే అవకాశాలున్నాయి. దిల్ రాజు , అశ్విని దత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా , దేవి శ్రీ సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







