కోలుకుంటున్న కెప్టెన్ రాజు: త్వరలో డిశ్చార్జ్
- June 28, 2018
మస్కట్: సినీ నటుడు కెప్టెన్ రాజు, దర్సయిత్లోని కేరళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్)లో కోలుకుంటున్నారు. మంగళవారం ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారు. అమెరికా వెళుతుండగా, మార్గమధ్యంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. దాంతో మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని ఎమర్జన్సీ ల్యాండింగ్ చేశారు. హుటాహుటిన కెప్టెన్ రాజుని ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఆయన వైద్య చికిత్స పొందుతున్నారు. శనివారం నాటికి ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందనీ, అదే రోజు ఆయన్ని స్వదేశానికి పంపే ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వైద్యులు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. కిమ్స్ ఆసుపత్రి ప్రతినిథి మాట్లాడుతూ, కెప్టెన్ రాజు వయసు 68 ఏళ్ళనీ, ఈ వయసులో స్ట్రోక్ రావడం వింతేమీ కాదని చెబుతూ, తగిన వైద్యం అందించామనీ, ప్రస్తుతం కోలుకున్నారని చెప్పారు. కెప్టెనన రాజు వెంట ఆయన భార్య ఆసుపత్రిలోనే వున్నారు. తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ సినిమాల్లో ఆయన పలు సినిమాల్లో నటించారు. గతంలో ఆయన మిలిటరీ అధికారిగా భారతదేశంలో సేవలందించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..