కేసీఆర్ బయోపిక్ ‘ఉద్యమ సింహం’ లాంచ్.!
- June 28, 2018
ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే సావ్రితి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి ఘనవిజయం సాధించగా ఇటీవల మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా యాత్ర సినిమా ప్రారంభమైంది. తాజాగా మరో రాజకీయ నాయకుడి జీవిత కథ వెండితెరకెక్కేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ సారథి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బయోపిక్ ఈ రోజే (గురువారం) ప్రారంభమైంది.
ఈ సినిమాలో కేసీఆర్ పాత్రలో సీనియర్ నటుడు నాజర్ నటిస్తున్నారు. కల్వకుంట్ల నాగేశ్వర్రావు నిర్మిస్తున్న ఈ సినిమాకు అల్లూరి కృష్ణంరాజు దర్శకుడు. ‘ఉద్యమ సింహం’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను కేసీఆర్ తెలంగాణ సాధన కోసం దీక్షను ప్రారంభించిన నవంబర్ 29న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇతర నటీనటులు వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!