గల్ఫ్ లో ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులకు అండగా ఏపీఎన్‌ఆర్‌టీ
- June 28, 2018
గల్ఫ్ దేశాల్లో తలెత్తిన ఆర్థిక మాంద్యం ప్రవాసాంధ్రులపై ప్రభావం చూపిస్తోంది. ఖర్చుల నియంత్రణ, ఉద్యోగుల జాతీయకరణ, వీసా నిబంధనలతో వాళ్లంతా ఇప్పుడు స్వదేశానికి తిరుగుముఖం పట్టారు. ఉపాధి కోల్పోయి మాతృభూమికి చేరుకుంటున్న వారి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వారి నైపుణ్యాన్ని సానబెట్టి దేశీయ మౌలిక రంగ ప్రాజెక్టుల్లో ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ సాయంతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. రోజురోజుకు పెరుగుతున్న ఆర్థిక మాంద్యం విదేశాల్లో తెలుగు వాళ్ల ఉద్యోగాలకు, ఉపాధికి ఎసరు తెస్తోంది. దీంతో ఏడాది నుంచి రాష్ట్రానికి తిరిగివస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఆయా దేశాల్లో మారిన వీసా నిబంధనలు, ఉద్యోగాల జాతీయకరణ.. కువైట్, ఒమన్, ఖతర్, బెహ్రయిన్ దేశాల నుంచి వెనక్కి వచ్చేలా చేస్తున్నాయి. ప్రత్యేకించి ఏడారి దేశాల్లో నిర్మాణ రంగ ప్రాజెక్టులు నిలిచిపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. కొత్త నిబంధనలు ప్రవేశ పెట్టి వ్యయం తగ్గించుకునేందుకు గల్ఫ్ దేశాలు ప్రయత్నిస్తున్నాయి.
దీనిలో భాగంగా భారీస్థాయిలో ఉద్యోగుల తొలగింపు చేపట్టాయి. వీరిలో ఏపీ, తెలంగాణకు చెందిన వారే అధిక సంఖ్యలో ఉంటున్నారు. ఇలాంటి వారి కోసం ఏపీ సర్కారు ప్రత్యేక విధానం ప్రవేశ పెట్టింది. వారందరికి శిక్షణ ఇచ్చి దేశీయ ప్రాజెక్టుల్లో వినియోగించుకోనుంది. ఇందుకోసం విశాఖ, తిరుపతి, కర్నూలు, అమరావతిలో ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఎన్‌ఆర్‌టీ చేస్తున్న కృషిని కార్మికుల కుటుంబ సభ్యులు, బంధువులు అభినందిస్తున్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా