వీకెండ్‌లో మస్కట్‌ రోడ్‌ మూసివేత

- June 29, 2018 , by Maagulf
వీకెండ్‌లో మస్కట్‌ రోడ్‌ మూసివేత

మస్కట్‌: రువీ స్ట్రీట్‌ నుంచి రువీ రౌండెబౌట్‌ వరకు అల్‌ హమ్రియా రౌండెబౌట్‌ వరకు వెళ్ళే రోడ్‌లో స్లో లేన్‌ని ఆదివారం వరకు మూసివేస్తున్నట్లు మునిసిపల్‌ అథారిటీస్‌ వెల్లడించాయి. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ సహకారంతో ఈ రోడ్డు మూసివేతను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ని రువి బ్రిడ్జి వైపు మళ్ళిస్తున్నారు. అల్‌ వాడి అల్‌ కబీర్‌ రోడ్డుని ఆల్టర్‌నేట్‌ రోడ్డుగా లైట్‌ వెహికిల్స్‌, ట్రక్స్‌కి వినియోగిస్తారు. వాహనదారులు ఈ రోడ్డు మూసివేతను దృష్టిలో వుంచుకుని, ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించాలని, పరిమిత వేగంతో వాహనాలు ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు అధికారులు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com