ఇరాన్ నుండి క్రూడ్ ఆయిల్ దిగుమతులు కొనసాగుతాయి: టర్కీ
- June 29, 2018
ఇరాన్ నుండి తాము క్రూడాయిల్ దిగుమతులను ఇకపై కూడా కొనసాగిస్తామని టర్కీ స్పష్టం చేసింది. నవంబర్ 4 నుండి తాము విధించిన తాజా ఆంక్షలు అమలులోకి రానున్న నేపథ్యంలో ఇరాన్ నుండి క్రూడాయిల్ దిగుమతులను నిలిపివేయాలని అమెరికా విదేశాంగశాఖ తన మిత్రదేశాలకు సూచించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన టర్కీ ఆర్థిక మంత్రి నిహాత్ జెబికీ మీడియాతో మాట్లాడుతూ అమెరికా తీసుకున్న నిర్ణయాలకు తాము బద్ధులం కాలేమని స్పష్టం చేశారు. తాము ఐరాస నిర్ణయాలను గౌరవించి వాటిని అనుసరిస్తామని, వీటితో పాటు తమ జాతీయ ప్రయోజనాలకు అనువైన నిర్ణయాలను తీసుకుంటామని ఆయన వివరించారు. తమ మిత్ర దేశం ఇరాన్ అన్యాయమైన ఎటువంటి ఆంక్షలు ఎదుర్కోకుండా తాము దృష్టి పెడతామన్నారు. ఇరాన్ నుండి క్రూడాయిల్ దిగుమతులను నిలిపివేయాలంటూ అమెరికా చేసిన సూచనను బేఖాతరు చేస్తూ జపాన్, ద.కొరియా, భారత్ వంటి దేశాలతో పాటు ఐరోపా కూటమి కూడా తాము ఇరాన్ దిగుమతులను కొనసాగిస్తామని ఇప్పటికే స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్