టీనేజ్ డ్రగ్ స్మగ్లర్స్‌కి పదేళ్ళ జైలు
- June 30, 2018
బహ్రెయిన్ కస్టమ్స్ అధికారులు 17 ఏళ్ళ ఇండియన్ యువకుడ్ని మరిజువానా స్మగ్లింగ్ చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 16 ఏళ్ళ వయసున్న తన సహచరుడికి అందించేందుకు ఈ డ్రగ్స్‌ని నిందితుడు తీసుకొచ్చినట్లు విచారణలో తేలింది. బ్యాగ్‌ని ఎక్స్‌రే చేయగా, అందులో న్యూస్ పేపర్స్‌తో చేసిన నాలుగు బాల్స్ కన్పించాయనీ, వాటిని మ్యాన్యువల్‌గా తనిఖీ చేసి, ఓపెన్ చేయగా, అందులోంచి మరిజువానా బయటపడిందని అధికారులు చెప్పారు. అర కిలోగ్రాము వరకు ఈ డ్రగ్ బరువు తూగింది. నిందితులిద్దరికీ 10 ఏళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అలాగే చెరొక 5,000 బహ్రెయినీ దినార్స్ జరీమానాని సైతం న్యాయస్థానం ఖరారు చేసింది.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







