దిల్లీలో దారుణం ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య

- July 01, 2018 , by Maagulf
దిల్లీలో దారుణం ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య

దిల్లీలో దారుణం ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ఆదివారం తెల్లవారుజామున దారుణం చోటుచేసుకుంది. ఉత్తర దిల్లీలోని బురారీ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం ఓ ఇంట్లో 11 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు మైనర్లు ఉన్నట్లు తెలిపారు. మృతదేహాల కళ్లకు గంతలు, కాళ్లు చేతులు కట్టేసి ఉన్నట్లు చెబుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం..వారు ఫర్నీచర్‌ వ్యాపారం చేసేవారట. రోజూ ఉదయం 6 గంటలకు షాప్‌ తెరిచేవారు, ఈరోజు 7.30 అయినా తెరవకపోవడంతో అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లిచూశామని 11 మంది ఉరేసుకున్నట్లు కన్పించడంతో పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఆర్థిక సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నారా? లేదా పాత కక్షలతో ఎవరైనా చంపి ఉరి తీశారా? అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు వెల్లడించారు. ఒకేసారి 11 మంది మృతదేహాలు లభ్యమయ్యేటప్పటికి చుట్టు పక్కలవారు భయబ్రాంతులకు గురవుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com