ఆధార్ తో ఇన్స్టంట్ ఈ–పాన్
- July 01, 2018
వ్యక్తిగత, వ్యాపార అవసరాలరీత్యా తక్షణం పాన్ కార్డ్‌లను పొందాలనుకునే వారికోసం ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ ఇన్స్టంట్ ఈ–పాన్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. తొలిసారిగా పాన్ నంబర్ కోసం దరఖాస్తు చేసే వ్యక్తులకు ఆధార్‌తో అనుసంధానమైన కేటాయింపు వ్యవస్థను ప్రారంభించింది. ‘ఆధార్ కార్డులు ఉన్నవారెవరైనాసరే ఇన్స్టంట్ ఈ–పాన్ సేవలను పరిమితకాలంపాటు ఉచితంగా పొందొచ్చు’ అని ఐటీ శాఖ వెల్లడించింది.
‘ఈ వ్యవస్థలో పాన్‌కు దరఖాస్తు చేసిన వారికి ఆధార్‌తో జత అయిన మొబైల్ నంబర్‌కు వన్‌టైమ్ పాస్వర్డ్(ఓటీపీ) వస్తుంది. దీన్ని ఎంటర్ చేస్తే క్షణాల్లో ఈ–పాన్ నంబర్ కేటాయింపు పూర్తవుతుంది. ఆధార్‌లో ఉన్న విధంగానే పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, అడ్రస్ ఇతరత్రా వివరాలన్నీ కొత్త పాన్‌లో పొందుపరుస్తారు’ అని వివరించింది.
స్వదేశంలో నివసిస్తున్న భారతీయులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు(హెచ్‌యూఎఫ్), సంస్థలు, ట్రస్టులు, కంపెనీలు మాత్రమే ఈ–పాన్ సౌకర్యాన్ని వినియోగించుకోగలరని పేర్కొంది. ఆన్లైన్లో ఈ–పాన్ నంబర్ కేటాయింపు జరిగిన తర్వాత కొద్ది రోజులకు పాన్ కార్డును పోస్ట్ ద్వారా పంపుతారని ఐటీ అధికారి వెల్లడించారు. ఈ–పాన్‌కు
www.incometaxindiaefiling.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్