24 గంటల్లో 22 వేల ఎకరాలు బుగ్గిపాలు
- July 02, 2018
లాస్‌ఏంజెల్స్: ఉత్తర కేలిఫోర్నియాలోని యోలో కౌంటీలో శనివారం మధ్యాహ్నం రగులుకున్న కార్చిచ్చు ఆదివారం ఉదయం నాటికి దాదాపు 22 వేల ఎకరాల అటవీ ప్రాంతాన్ని బుగ్గిపాలు చేసింది. దీనితో అక్కడ నివశిస్తున్న వేలాది మంది ప్రజలను బలవంతంగా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు చెప్పారు. శనివారం మధ్య్నాం యోలో కౌంటీకి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆరంభమైన ఈ కార్చిచ్చు వేగంగా విస్తరించటంతో ఆ ప్రాంతంలో వేడిగాలులు, విపరీతమైన వేడీ వ్యాపించాయని కాలిఫోర్నియా ఫైర్‌సర్వీస్ (కాల్‌ఫైర్) అధికారులు చెప్పారు. గిండా ప్రాంతంలోని రగులుకున్న ఈ కార్చిచ్చు కారణంగా అక్కడి మొత్తం నివాసితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. ఈ అగ్నికీలలను అదుపు చేసేందుకు 29 మంది అగ్నిమాపక సిబ్బంది, 110 అగ్నిమాపక శకటాలు, 12 హెలీకాప్టర్లు సమిష్టిగా ప్రయత్నిస్తున్నాయని కాల్‌ఫైర్ సర్వీస్ వెల్లడించింది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్