24 గంటల్లో దుబాయ్ వర్క్ వీసా
- July 02, 2018
దుబాయ్:జబెల్ అలి ఫ్రీ జోన్ (జఫ్జా), నేషనల్ ఇండస్ట్రీస్ పార్క్ (ఎన్ఐపి) కంపెనీలు, ఉద్యోగుల వీసా అప్లికేషన్లను 24 గంటల్లో ప్రాసెస్ చేయడానికి వీలు కలిగింది. జఫ్జా మరియు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ ఎఫైర్స్ (జిడిఆర్ఎఫ్ఎ) అగ్రిమెంట్‌పై సంతకం చేశాక ఈ వెసులుబాటు కలిగింది. ఈ నిర్ణయం కారణంగా 7,500 కంపెనీల్లో పనిచేస్తోన్న 150,000 మందికి ఉపయోగంగా వుంటుంది. వర్క్ మరియు రెసిడెన్సీ వీసా పొందాలనుకునేవారికి ఈ నిర్ణయంతో ఎంతో లాభం చేకూరుతుందని, కంపెనీలు ఇతర బిజినెస్ యాక్టివిటీలపైనా ఫోకస్ పెట్టడానికి వీలవుతుందని డిపి వరల్డ్ సీఈఓ మరియు గ్రూప్ ఛైర్మన్ సుల్తాన్ అహ్మద్ బిన్ సులేయెమ్ చెప్పారు. జిడిఆర్ఎఫ్ఎ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి మాట్లాడుతూ, జఫ్జాతో మెరుగైన భాగస్వామ్యం, అలాగే దుబాయ్ స్ట్రాటజిక్ విజన్‌ని అందుకోవడం వంటి ముఖ్యమైన అంశాల నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..