'ఒకటే లైఫ్‌' గీతాలు విడుదల

- July 02, 2018 , by Maagulf
'ఒకటే లైఫ్‌' గీతాలు విడుదల

సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌ అధినేత ఆర్‌బి. చౌదరి పెద్ద కుమారుడు రమేష్‌ చౌదరి హీరోగా నటిస్తున్న చిత్రం 'ఒకటే లైఫ్‌'. లార్డ్‌ వెంకటేశ్వర ఫిలిమ్స్‌ పతాకంపై నారాయణ రామ్‌ నిర్మిస్తున్నారు. ఎం. వెంకట్‌ దర్శకుడు. 'హ్యాండిల్‌ విత్‌ కేర్‌' అనేది ఉప శీర్షిక. ఈ చిత్రంలోని పాటలు ప్రసాద్‌లాబ్‌లో విడుదల చేశారు. బి.జె.పి. అధికార ప్రతినిధి రఘునందనరావు ఆడియోను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 'దీనిని సూపర్‌గుడ్‌ కుటుంబంగా భావించవచ్చు. ఏ రంగంలో ఉన్నవారు ఆ రంగంలో వారిని ప్రోత్సహించాలి. కొత్తదనం రావాలి. చిన్న సినిమాలు బతకాలి. నాలుగు కుటుంబాలు. నలుగురు హీరోలే అంటే కుదరని పరిస్థితి వచ్చింది. కొత్త వాళ్లు వస్తే కొత్త ఆలోచనలతో చిత్ర సీమ కొత్త కళలతో నిండుగా ఉంటుంద'ని అన్నారు. 
దర్శకుడు వెంకట్‌ మాట్లాడుతూ 'టెక్నాలజీతో పరుగు పెడుతున్న నేటి తరం మానవత విలువలకు కుటుంబ బంధాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న కథాంశంతో తెరకెక్కిన చిత్రం. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నామ'ని చెప్పారు.
హీరో రమేష్‌ చౌదరి మాట్లాడుతూ 'సినిమా నాకు పెద్ద టర్నింగ్‌ అవుతుంది. తెలుగులో 'విద్యార్థి' చిత్రం తరువాత కొన్ని తమిళ్‌ సినిమాలు చేశాను. చాలా గ్యాప్‌ తరువాత ఈ చిత్రం చేస్తున్నాను. యువతకి మంచి మెస్సేజ్‌ ఇచ్చే చిత్రం ఇదని పేర్కొన్నారు. భాషాశ్రీ, విశ్వ, బండోజి సాహిత్యాన్ని అందించారు. అమ్రీష్‌ బాణీలు సమకూర్చారు. సునీల్‌ కాస్యప్‌ నేపథ్య సంగీతాన్ని సమకూర్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com