యూఏఈ, బహ్రెయిన్‌లలో థియేటర్లను కొనుగోలు చేయనున్న కార్నివాల్‌

- July 03, 2018 , by Maagulf
యూఏఈ, బహ్రెయిన్‌లలో థియేటర్లను కొనుగోలు చేయనున్న కార్నివాల్‌

ఇండియాకి చెందిన కార్నివాల్‌ సినిమాస్‌ అలాగే, యూఏఈలోని పార్టనర్‌ కలిసి సంయుక్తంగా ఖతార్‌ బేస్డ్‌ నోవో సినిమా థియేటర్లను యూఏఈ, బహ్రెయిన్‌లలో కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియవస్తోంది. సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్‌, ఈజిప్ట్‌ 2017 నుంచి ఖతార్‌తో వాణిజ్య సంబంధాల్ని తెగతెంపులు చేసుకున్న దరిమిలా, ఈ డీల్‌ తెరపైకి వచ్చింది. యూఏఈకి చెందిన ఎమిరేట్స్‌ నేషనల్‌ హోల్డింగ్స్‌ని పొటెన్షియల్‌ కో-ఇన్వెస్టర్‌గా కార్నివాల్‌ సినిమా భావిస్తోంది. కార్నివాల్‌, భారతదేశంలోని 115 నగరాల్లో థియేటర్లను నిర్వహిస్తోంది. ఓనర్‌షిప్‌ చట్టాల నేపథ్యంలో గల్ఫ్‌లో స్థానిక కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాల్సి వుంటుంది ఫారిన్‌ కంపెనీలు. యూఏఈ మరియు గల్ఫ్‌ దేశాల్లో ఎక్కువగా బాలీవుడ్‌ సినిమాలకు గిరాకీ వుంటోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com