టాలీవుడ్ చూపు.. అగస్టు నెల వైపు.. పోటీలో స్టార్ ప్రొడ్యూసర్‌లు..
- July 04, 2018
టాలీవుడ్ ఇండ్రస్టీలో అగ్ర నిర్మాతల పేర్లు చెప్పమంటే ఠక్కున చెప్పే ముగ్గురు పేర్లు సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్‌రాజు. టాలీవుడ్ త్రిమూర్తులుగా వెండితెరపై సంచలనాలు సృష్టిస్తున్న ఈ నిర్మాతలు.. ఇప్పుడు ఒకే సమయంలో సినిమాలు రీలీజ్ చేయటానికి రెడీ అవుతున్నారు.
సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాణ సారథ్యంలో 'శ్రీనివాస కళ్యాణం' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. శతమానం భవతి సినిమాతో ఘనవిజయం సాధించిన సతీష్ వేగేశ్న ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 9న రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. 'దిల్' సినిమా తరువాత మళ్లీ ఇన్నేళ్లకు ఈ కాంబినేషన్‌లో మూవీ వస్తుండటంతో.. ఈ సినిమాపై బారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ప్రొడ్యూసర్ బన్నివాసు నిర్మాణంలో మరో అగ్ర నిర్మాత శ్రీ అల్లు అరవింద్ సమర్పణలో 'గీత గోవిందం' చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ఈ మూవీ ఆగస్టు 15 ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. గీతా ఆర్ట్స్‌లో 'శ్రీరస్తు శుభమస్తు' మూవీ తరువాత దర్శకుడు పరశురామ్ (బుజ్జి) ఈ సినిమా చేస్తుండటంతో.. ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఆసక్తి పెరిగింది.
టాలీవుడ్ త్రిమూర్తుల్లో ఒకరైన సురేష్ బాబు కూడా ఆగస్టు 15న ఓ సినిమాని రీలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. సురేష్ ప్రొడక్షన్స్‌తో సంయుక్తంగా 'రాణా “C/O కంచెరపాలెం” అనే సినిమాని సమర్పిస్తున్నాడు. పరుచూరి ప్రవీణ నిర్మాణంలో మహా వెంకటేష్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ మూవీ న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి ఎంపికైన తొలి తెలుగు సినిమా కావడంతో అందరి దృష్టి ఈ చిత్రంపై పడింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతలుగా చలామణి అవుతున్న ఈ ముగ్గురి సినిమాలు ఒకే సమయంలో వస్తున్నాయి. ఆగస్టులోనే ఈ మూడు సినిమాలు రిలీజ్ అవుతుండంటంతో టాలీవుడ్ చూపు వీటిపైనే ఉంది. ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్‌ల సినిమాలు ఒకేసారి ఇలా పోటీపడుతుండటంతో సిని అభిమానులు ఈ చిత్రాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి!
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!