1168 అడుగుల ఎత్తు నుండి మ్యాచ్ చూసిన త్రిష

- July 05, 2018 , by Maagulf
1168 అడుగుల ఎత్తు నుండి మ్యాచ్ చూసిన త్రిష

చెన్నై బ్యూటీ త్రిష తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. ప్రస్తుతం ఆమె తెలుగులో సినిమాలు చేయకపోయినప్పటికి తమిళం, మలయాళంలో మాత్రం వరుస ప్రాజెక్ట్స్ చేస్తుంది. ఎక్కువగా లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులని పలకరిస్తుంది. హరర్ సినిమాలలోను త్రిష అడపాదడపా కనిపిస్తూనే ఉంది . అయితే సాహసాలకు కేరాఫ్ అడ్రెస్‌గా ఉన్న త్రిష తాజాగా కెనడాలో బంగీ జంప్ చేసింది. ఓ బేస్‌బాల్ స్టేడియంకు 1168 అడుగుల ఎత్తులో త్రిష ఈ సాహసం చేసింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. `1168 అడుగుల దిగువన జరుగుతున్న బేస్‌బాల్ మ్యాచ్‌ను 10 నిమిషాలపాటు చూడడం చాలా గొప్ప అనుభూతి ` అంటూ త్రిష్ ట్వీట్ చేసింది. త్రిష సాహసాన్ని నెటిజన్స్ అభినందిస్తున్నారు. ఇటీవల త్రిష పెళ్ళికి సంబందించి పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీనిపై స్పందించిన త్రిష పెళ్లి ఆలోచన నా మనసులో ఇప్పటి వరకు లేదు. నా మనసుకు నచ్చిన వ్యక్తి నాకు తారస పడితే కచ్చితంగా ప్రేమ వివాహమే చేసుకుంటాను. దీని గురించి అఫీషియల్ ప్రకటన కూడా ఇస్తానంటూ త్రిష వెల్లడించిన విషయం విదితమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com