స్వామీజీని ఉరితీశారు...

- July 05, 2018 , by Maagulf
స్వామీజీని ఉరితీశారు...

జపాన్‌లో ఆమ్ షిన్రికియో కల్ట్ నేత షోకో అసాహారా, ఆయన ఆరుగురు అనుచరులను ఈరోజు ఉరితీశారు. ఈ విషయాన్ని జపనీస్ మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరో 12 మంది ఆమ్ సిన్రికియో కల్ట్ సభ్యులకు మరణశిక్ష అమలు చేయాల్సి ఉంది. వీరందరికీ జనవరిలో ఉరిశిక్షలు ఖరారు చేశారు. 1995లో టోక్యోలోని సబ్‌వేలో కార్లలో విషవాయువు వదిలిన కేసులో వీరిని ఉరితీశారు. ఈ ఘటనలో 13 మంది మృతిచెందగా, 6 వేల మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. జపనీస్ ప్రభుత్వ అధికార ప్రతినిధి కల్ట్ నేత అసాహారా ఉరిని నిర్ధారించారు.

1995 సబ్‌వే దాడి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్లాస్టిక్ సంచులలో విషవాయువు నింపి... రైలు, కార్లలో విడుదల చేయడంతో 13 మంది మృతిచెందగా... వేలాది మంది అస్వస్థతకు గురయ్యారు. 1984లో స్థాపించబడిన ఆమ్ షిన్రికియో కల్ట్... అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల గ్రాడ్యుయేట్లను కూడా పొందింది. జపాన్‌తో పాటు రష్యాలోనూ ఈ ఆమ్ షిన్రికియో కల్ట్‌ను ఆచరించేవారున్నారుఅయితే ఈ కల్ట్ మూడు గ్రూపులుగా విడిపోయింది. అనంతరం ప్రభుత్వం నిషేధించింది. అసాహారాను ఉరి తీయడంతో ఎలాంటి ప్రతీకార దాడులు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు... వారి ప్రభావిత ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com