హౌజ్ వైఫ్ గా ఉండాలని నిర్ణయం! సినిమాలకు సమంత గుడ్ బై?
- July 07, 2018
టాలీవుడ్ టాప్ హీరోయిన్… ఇండస్ట్రీ అగ్ర కుటుంబానికి కోడలైంది.. తన అభిమానులతో పాటు.. అక్కనేని అభిమానులకు కూడా ఇప్పుడామే ఆరాధ్యం. తమ అభిమాన హీరో కోడలు.. ఇలానే ఉండాలని వారు ఒక లైన్ పెట్టుకుంటారు. దీనిని తూచా తప్పకుండా పాటించాలనుకుంటున్నారు సమంత. అక్కనేని కోడలుగా, మంచి గృహిణిగా.. పిల్లా పాపలతో ఉండాలని శామ్ నిర్ణయించుకున్నారట. అక్కనేని నాగ చైతన్యను పెళ్లి చేసుకున్నా కూడా టాప్ హీరోల సినిమాలతో దుమ్మలేపుతున్నారు ఆమె. ప్రస్తుతం తన చేతిలో ఉన్న ఐదు ప్రాజెక్ట్ లను పూర్తి చేసి.. ఇక పూర్తిగా సినిమాలకు గుడ్ చెప్పాలనుకుంటున్నారట.
నాగచైతన్యతో పెళ్లి తర్వాత వచ్చిన రంగస్థలం మూవీ సమంత నటనకు ఓ మైలురాయి. ఈ బిజీలో పడి కుటుంబం గురించి ఆలోచించకపోతే.. భవిష్యత్ లో బాధపడటం ఎందుకు అనే ఆలోచనలో ఉన్నారట ఆమె. చేతిలో ఉన్న సినిమాలన్నీ కంప్లీట్ చేసేసి.. మూడు, నాలుగు ఏళ్లు భర్త, పిల్లలతో ఓ గృహిణిగా హాయిగా ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తున్నారట. అందులో భాగంగానే కొత్తగా ఏ ఒక్క సినిమాను అంగీకరించటం లేదని సినీ ఇండస్ట్రీలోని నిర్మాతలు చెబుతున్నారు.
ప్రస్తుతం సమంత వయస్సు 31.. సినిమాలకు గుడ్ బై చెప్పాడానికి ఇద రైట్ టైం అని ఆమె భావిస్తున్నారట. ఇక నుంచి హౌజ్ వైఫ్ గా ఉంటూ.. పిల్లల్ని కనాలని సమంత నిర్ణయించుకున్నారట. ఇందుకు భర్త నాగచైతన్యతోపాటు సమంత కూడా ఏకాభిప్రాయానికి వచ్చారట. అందులో భాగంగానే కొత్త సినిమాలు అంగీకరించటం లేదనే సినిమా ఇండస్ట్రీ టాక్.
సమంత సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారం జరుగుతోంది. దీనిపై జాతీయ మీడియా కూడా ఫోకస్ చేయడం విశేషం. అయితే ఈ విషయంపై నాగచైతన్య కానీ, సమంత కాని ఇంత వరకు స్పందించలేదు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







