గంటల వ్యవధిలోనే అతి భారీవర్షం.. 85 మంది మృతి
- July 08, 2018
ఎడతెరిపి లేని వర్షాలకు జపాన్‌లోని పలు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. వరదల్లో చిక్కుకుని ఇప్పటివరకూ 85 మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్నిచోట్ల కొండ చరియలు విరిగిపడడం కూడా మరణాలకు కారణమైంది. మరో 60 మంది ఆచూకీ తెలియడం లేదు. వేలాది ఇళ్లు వరదల ఎఫెక్ట్‌కి నేలమట్టం అయ్యాయి. దాదాపు 20 లక్షల మంది పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు.
సహాయ చర్యల కోసం ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించినా లోతట్టు ప్రాంతాల్లో సాధరణ పరిస్థితి రావడానికి చాలా రోజులు పట్టేలా కనిపిస్తోంది. ప్రధాని షింజో అబే పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
గంటల వ్యవధిలోనే అతి భారీవర్షం కురవడం వల్ల పలు నగరాల్లో పరిస్థితి దుర్భరంగా మారింది. ప్రస్తుతం సహాయ చర్యల కోసం ఆర్మీని రంగంలోకి దించారు. హెలీకాఫ్టర్ల సాయంతో బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
కొచీ ప్రాంతంలోని సుకుమోలో రెండు గంటల వ్యవధిలో 26.3 సెం.మీ. వర్షం కురిసింది. అంటే దాదాపు 10 ఇంచుల మేర కుండపోతతో నగరంతా పూర్తిగా నీళ్లతో నిండిపోయింది. ఇక మోటోయమా ప్రాంతంలో రోజంతా వర్షం కురుస్తూనే ఉంది. ఏకంగా 24 గంటల్లో అక్కడ 583 మిల్లీ మీటర్లు, అంటే 23 ఇంచీల వర్షం కురిసింది. అటు, ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వానగండం తప్పినా.. పూర్తిగా నానిపోయిన కొండ చరియలు భయపెడుతున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..