'శైలజారెడ్డి అల్లుడు' ఫస్ట్ లుక్
- July 09, 2018
ఈ ఏడాది నాగ చైతన్య సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఏమీ ఇంతవరకు అక్కినేని అభిమానులకు కిక్ ఇవ్వలేదు. సవ్యసాచి ఫస్ట్ లుక్ తో మాస్ గా కనబడిన నాగ చైతన్య ఇప్పుడు క్లాసీ గా సూపర్ లుక్ తో అక్కినేని అభిమానులనే కాదు సాధారణ ప్రేక్షకులను కూడా ఫిదా చేసేసాడు. మారుతీ దర్శకత్వంలో అను ఇమ్మాన్యువల్ తో రొమాన్స్ చేస్తున్న నాగ చైతన్య శైలజారెడ్డి అల్లుడు గా ప్రేక్షకులను పలకరించడానికి రేడి అవుతున్నాడు. శివగామి పాత్రలో విశ్వరూపం చూపించిన రమ్యకృష్ణ ఈ సినిమా లో నాగ చైతన్య కి పొగరున్న అత్తగా శైలజ రెడ్డి పాత్రలో నటిస్తుంది. సోమవారం ఉదయం శైలజ రెడ్డి లుక్ ని మూవీ యూనిట్ విడుదల చేసింది.
అలరిస్తున్న ఫస్ట్ లుక్
మరి శైలజ రెడ్డి అల్లుడు సినిమా ఫస్ట్ లుక్ లో రమ్యకృష్ణ పవర్ ఫుల్ అత్తగా. కుర్చీలో కూర్చుని సీరియస్ లుక్ తో చైతు, అను ఇమ్మాన్యువల్ ని చూస్తుంటే. అల్లుడు నాగ చైతన్య మాత్రం అత్తగారి లుక్ కి ఏ మాత్రం భయపడకుండా ఆమె కూతురు అను ఇమ్మాన్యువల్ ని రొమాంటిక్ గా హాగ్ చేసుకుని స్టైలిష్ స్మైల్ తో అదరగొడుతున్నాడు. అలాగే శైలజ రెడ్డి అల్లుడు మూవీ ఫస్ట్ లుక్ లో మరో లుక్ నాగ చైతన్య మొన్నామధ్యన సోషల్ మీడియాలో హల్చల్ చేసిన లుక్కే. ఆ లుక్ లో నాగ చైతన్య ఫార్మల్ వెర్ లో టక్ చేసుకుని క్లాస్ లుక్ లో చంపేస్తున్నాడు. మరి అదే లుక్ ని గతంలో యూనిట్ సభ్యులెవరో ఇంటర్నెట్ లో లీక్ చేసి ఉండవచ్చు. అయినప్పటికీ చైతు ఈ క్లాస్ లుక్ మాత్రం అదుర్స్.
కొత్తదనం ఉంటుందా..?
మారుతీ ఈ సినిమాని రొటీన్ భిన్నంగా తెరకెక్కిస్తున్నాని చెబుతున్నాడు. మరి ఎంతవరకు కొత్తదనాన్ని ఈ సినిమాలో మారుతీ చూపిస్తాడో చూడాలి. గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఆగష్టు నెలాఖరున విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాపై నాగ చైతన్య మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడనేది మూవీ యూనిట్ మాట.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







