గుండెపోటుతో మృతి చెందిన కమెడియన్
- July 09, 2018
టీవీ నటుడు, కమెడియన్ కవి కుమార్ ఆజాద్ సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తారక్ మెహతా కా ఉల్టా చష్మా షోలో డాక్టర్ హన్స్‌రాజ్ హాతి క్యారెక్టర్‌తో కుమార్ పేరు తెచ్చుకున్నాడు. ఈ రోజు ఉదయం తీవ్రంగా గుండె పోటు రావడంతో వోక్‌హార్డ్ ఆసుపత్రిలో చేరిన కుమార్ చికిత్స తీసుకుంటూ మరణించాడు. ఆరోగ్యం బాలేకపోయినా షూటింగుల్లో పాల్గొంటూ బిజీగా ఉండేవాడు. ఈ రోజు ఉదయం ఫోన్ చేసి ఆసుపత్రికి వెళుతున్నానని, షూటింగ్‌కి రాలేనని చెప్పాడు. అయితే కొద్ది సేపటికే అతడు మరణించిన వార్త వినడం బాధకు గురిచేసిందని షో ప్రొడ్యూసర్ అసిత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మేలా. ఫంతూష్ వంటి బాలీవుడ్ సినిమాల్లోనూ కవి కుమార్ నటించాడు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!