థాయ్ ల్యాండ్:గుహ నుంచి బయటపడ్డ 8 మంది చిన్నారులు
- July 09, 2018
చియాంగ్ రాయ్ : థాయిలాండ్‌లోని థామ్ లాంగ్ గుహలో చిక్కుకున్న చిన్నారుల్ని రెస్క్యూ టీమ్ బయటకు తీసుకువస్తున్నది. ఆదివారం నలుగురు పిల్లల్ని బయటకు తీసిన డైవర్లు ఇవాళ మరో నలుగురు పిల్లల్ని బయటకు తీసుకువచ్చారు. దీంతో మొత్తం రెస్క్యూ చేసిన పిల్లల సంఖ్య ఎనిమిదికి చేరుకున్నది. జూన్ 23న గుహలో చిక్కుకున్న చిన్నారులను కాపాడేందుకు థాయ్ ప్రభుత్వం శతప్రయత్నాలు చేస్తోంది. 25 ఏళ్ల కోచ్‌తో సహ మొత్తం 13 మంది పిల్లలు గుహలో చిక్కుకున్న విషయం తెలిసిందే. థాయ్‌ల్యాండ్‌తో పాటు అంతర్జాతీయ డైవర్లు ఇవాళ ఆక్సిజన్ సిలెండర్లతో గుహలోకి ప్రవేశించారు. పిల్లల్ని బయటకు తీసుకురాగానే వాళ్లను మెడికల్ సెంటర్‌కు తరలిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..