స్వామి పరిపూర్ణానందకు నోటీసులు

- July 10, 2018 , by Maagulf
స్వామి పరిపూర్ణానందకు నోటీసులు

దైవ సృష్టిలో అన్నికులాలు, మతాలు ఒకటే అన్నారు స్వామి పరిపూర్ణానంద. ధర్మాగ్రహ దీక్ష చేయకుండా హౌస్ అరెస్ట్‌ చేయడాన్ని ఆయన ఖండించారు. రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు బాధాకరమన్నారు. భావ ప్రకటన స్వేచ్చ పేరుతో కొందరు చేస్తున్న వ్యాఖ్యలు కోట్లాది మంది ప్రజల హృదయాలను గాయపరిచాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

మతాల ఉనికిని దెబ్బ తీస్తే రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందన్న పరిపూర్ణానంద.. హిందూధర్మంపై బాబు గోగినేని దుర్మార్గపు భావజాలాన్ని రుద్దుతున్నారని మండిపడ్డారు.

అటు..స్వామి పరిపూర్ణానంద గృహనిర్బంధం కొనసాగుతోంది. జూబ్లీహిల్స్‌లో ఆయన ఉన్న నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎవ్వరూ రాకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. నిన్న పరిపూర్ణానంద తలపెట్టిన పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు.. జూబ్లీహిల్స్‌లోనే ఆయన్ను హౌస్ అరెస్టు చేశారు. 

ధర్మాగ్రహ యాత్రకు అనుమతి లేదంటున్న పోలీసులు.. పరిపూర్ణానందకు సీఆర్‌పీసీ సెక్షన్ 151 కింద నోటీసులు ఇచ్చారు. దీని ప్రకారం శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా..ర్యాలీలు, సభలు, సమావేశాలు చేస్తే అరెస్ట్‌కు అవకాశం ఉంటుంది. అటు.. పరిపూర్ణానందతో పాటు 30 మందిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరిపూర్ణానంద ఇంట్లోనే దీక్ష కొనసాగిస్తున్నారు. ఆయన యాత్ర చేసేందుకు బయటికి వస్తే అరెస్ట్‌ తప్పదని పోలీసులు స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com