బహ్రెయిన్:డ్రగ్స్‌ స్మగ్లింగ్‌: 33 ఏళ్ళ వ్యక్తి అరెస్ట్‌

బహ్రెయిన్:డ్రగ్స్‌ స్మగ్లింగ్‌: 33 ఏళ్ళ వ్యక్తి అరెస్ట్‌

33 ఏళ్ళ జీసీసీ జాతీయుడ్ని కింగ్‌ ఫహాద్‌ కాజ్‌వే వద్ద బహ్రెయిన్‌లోకి అడుగు పెడుతుండగా కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌ అరెస్ట్‌ చేసింది. తన కారులో డ్రగ్స్‌ని దారి తరలిస్తున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తనిఖీల్లో తేల్చారు. అతని నుంచి 50 నార్కోటిక్‌ పిల్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు బహ్రెయినీలకు ఈ డ్రగ్స్‌ని విక్రించేందుకు నిందితుడు ప్రయత్నించినట్లు తేల్చారు విచారణ సందర్భంగా. ఈ నేపథ్యంలో నిందితుడికి ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అలాగే 3,000 బహ్రెయినీ దినార్స్‌ జరీమానా సైతం న్యాయస్థానం ఖరారు చేసింది. ఇదే కేసులో, డ్రగ్స్‌ కొనుగోలుకు యత్నించిన ఇద్దరు వ్యక్తులకు ఆరు నెలల జైలు శిక్ష, 500 బహ్రెయినీ దినార్స్‌ జరీమానా విధించింది న్యాయస్థానం. 

Back to Top