మెగా తనయ నీహారిక 'వెడ్డింగ్' డేట్ ఫిక్స్..
- July 11, 2018
మెగా తనయ నీహారిక బుల్లి తెరమీద యాంకరింగ్ చేసినా, సినిమాల్లో నటించినా క్యూట్‌గానే ఉంటుంది. మెగా తనయులు మాత్రమే ఇండస్ట్రీని ఏలుతున్న తరుణంలో నీహారిక తెరపైకి వచ్చింది. తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఆమె నటించిన ఒక మనసు హిట్ టాక్ తెచ్చుకోకపోయినా నీహారిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. 'హ్యాపీ వెడ్డింగ్' అంటూ మరోసారి సందడి చేయబోతుంది నీహా. చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్, టీజర్ వంటి వాటితో అభిమానులను ఊరిస్తున్నఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఓ చక్కటి కుటుంబ వాతావరణ నేపథ్యంతో చిత్ర కథను రూపు దిద్దినట్లు దర్శకుడు తెలియజేస్తున్నారు. పాల లాంటి మా హర్ష.. కాఫీ చేసుకోవచ్చు, కాంప్లేన్ కలుపుకోవచ్చు... మరి మా మనవడితో కాపురం చేసుకోవచ్చా.. ట్రైలర్ ద్వారా రిలీజైన ఈ డైలాగ్ అందర్నీ ఆకట్టుకుంటోంది. నీహారిక పెళ్లి కూతురైతే సుమంత్ అశ్విన్ పెళ్లికొడుకు. జంట చూడముచ్చటగా ఉంది. సినిమా కూడా సూపర్‌గా ఉండొచ్చని అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..