నేడు కాంగ్రెస్‌లోకి కిరణ్‌కుమార్‌రెడ్డి
- July 12, 2018
నేడు కాంగ్రెస్‌లోకి కిరణ్‌కుమార్‌రెడ్డి దిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు కాంగ్రెస్‌లో చేరనున్నారు. రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన జైసమైక్యాంధ్ర పార్టీ ప్రారంభించారు. 2014 ఎన్నికల తర్వాత నాలుగేళ్లపాటు రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన ఇటీవల ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు ఊమెన్ చాందీతో భేటీ అయ్యారు. చాందీ ఆహ్వానం మేరకు తిరిగి కాంగ్రెస్‌లో చేరడానికి అంగీకరించిన ఆయన గురువారం దిల్లీకి చేరుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఏఐసీసీలో జరగనున్న ఈ కార్యక్రమంలో ఊమెన్‌చాందీ, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొంటారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







