భారత్ ప్రధాని అవుతా అంటున్న జాన్వీ
- July 16, 2018
సినిమా ఇండస్ట్రీలో అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న అందాల నటి శ్రీదేవి అనుకోకుండా ప్రమాద వశాత్తు మృతి చెందారు. అయితే తన పెద్ద కూతురు జాహ్నవిని హీరోయిన్ గా చూడాలన్న కోరిక శ్రీదేవికి తీరకుండానే అనంత లోకాలకు వెళ్లారు. దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించిన ధడక్ సినిమా ప్రమోషన్ వర్క్ బాగా జరుగుతుంది. తాజాగా జాన్వీ కపూర్ భవిష్యత్తులో ప్రధానమంత్రి అవుతుందట.
ఔను, ఆ విషయం ఆమే స్వయంగా చెప్పింది. ఇంతకీ ఏ పార్టీ నుంచి అని అడగకండి. జాన్వీ నటించిన 'దఢక్ ' సినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోంది జాన్వీ. ఈ క్రమంలో తన కోస్టార్ ఇషాన్ కట్టర్ తో కలిసి మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. రీసెంట్ గా ఆమెను మనకు కాబోయే ప్రధాని ఎవరూ అని అడిగారు.
ఈ ప్రశ్నకు ఫన్నీగా సమాధానమిస్తూ.. నాకైతే నేనే ప్రధానమంత్రి అవుతా అనిపిస్తోంది అని చెప్పింది. ఇంతలోనే నాలుక కరుచుకుని.. ''ప్లీజ్ ఈ విషయం రాయొద్దు'' అని అడిగింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది తాను కేవలం ఫన్నీకోసమే అన్నా వార్త మాత్రం బాగానే వైరల్ అయ్యింది.
ఇటీవల విడుదలైన 'దఢక్ ' సినిమా ట్రైలర్ 'జింగాట్' అనే పాటకు ప్రేక్షకాదరణ దక్కాయి. సినిమా కూడా కచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. 'సైరత్' సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..