సలామ్ ఎయిర్ కొత్త విమానాలు, కొత్త రూట్స్
- July 17, 2018మస్కట్:ఒమన్ తొలి బడ్జెట్ ఎయిర్ లైన్ సలామ్ ఎయిర్, ఆరు కొత్త ఎయిర్ క్రాఫ్ట్‌లను, ఎయిర్ బస్ ఎ320 నియోను తన ఫ్లీట్లోకి చేర్చుకుంది. కొత్త ఎయిర్ క్రాఫ్ట్‌లు సలామ్ ఎయిర్ కోసం ప్రత్యేకించి రూపొందించబడ్డాయి. వీటిలో 180 సీట్లు వుంటాయి. ప్రస్తుతం వున్న సలాలా, ముల్తాన్, సియాల్కోట్, షిరాజ్లతోపాటు కొత్త రూట్లు కువైట్ సిటీ, రియాద్, ఖర్తౌమ్, ఈజిప్ట్, ఇరాక్, ఢాకా, ఖాట్మండు సహా ఇండియాలోని పలు నగరాలకు వీటిని వినియోగించనున్నారు. సలామ్ ఎయిర్ సిఇఓ కెప్టెన్ మొహమ్మద్ మాట్లాడుతూ, ఏవియేషన్ ఇండస్ట్రీ మిడిల్ ఈస్ట్‌లో చాలా వేగంగా విస్తరిస్తోందనీ, ఈ నేపథ్యంలోనే సలామ్ ఎయిర్ తన కార్యకలాపాల్ని మరింత విస్తరిస్తూ, ప్రయాణీకులకు మెరుగైన సేవల్ని అందించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..