మరో నెల రోజుల పాటు మీడియాతో మాట్లాడకూడదు
- July 18, 2018
థాయ్లాండ్ థామ్ లువాంగ్ గుహలో చిక్కుకుని 18 రోజుల నరకం తర్వాత బయటపడిన పిల్లలు, వారి ఫుట్బాల్ కోచ్ మీడియాతో మాట్లాడారు. చిన్నారులు, వారికి చికిత్స అందిస్తున్న వైద్యులతో కలసి మాట్లాడారు. గుహలో తాము ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను మీడియాతో పంచుకున్నారు. తొలుత చిన్నారులు అందరికి నమస్కారం చెబుతూ, ఫుట్బాల్ చేతిలో పట్టుకొని వేదికగా వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్థలంలో కొద్ది సేపు ఫుట్బాల్ ఆడారు. వారు సరాదాగా ఫుట్బాల్ ఆడిన వీడియో వైరల్గా మారింది.
చిన్నారులతో పాటు వారి కోచ్ కూడా ఆరోగ్యంగా ఉన్నట్టు డాక్టర్లు వెల్లడించారు. వారందరి బరువు సరాసరిగా 3 కేజీలు పెరిగినట్టు తెలిపారు. మరోవైపు వైద్యులు సూచించిన ప్రశ్నలను మాత్రమే అడిగేందుకు అనుమతించారు. వారందరి మానసిక సమతుల్యత మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. చికిత్స ముగియడంతో అందరినీ ఇళ్లకు పంపించారు. బాలలను, వారి తల్లిదండ్రులను మరో నెల రోజుల వరకు మీడియాలో మాట్లాడకూడదని చెప్పి పంపారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!