16 ఏళ్ళ యువకుడికి 3 నెలల జైలు
- July 19, 2018ఓ యువకుడ్ని గాయపరిచిన కేసులో 16 ఏళ్ళ యువకుడికి 3 నెలల జైలు శిక్ష, 10,000 దిర్హామ్‌ల జరీమానా విధించింది న్యాయస్థానం. నిందితుడి చేతిలో గాయపడ్డ బాధితుడికి ఓ కంటి చూపు పూర్తిగా పోయింది. చిన్న గొడవ కాస్తా పెద్దది కావడంతో, కర్రతో నిందితుడు, బాధితుడిని కొట్టగా ఈ ఘటనలో బాధితుడి కుడి కంటికి తీవ్ర గాయమయ్యింది. ఈ క్రమంలో బాధితుడు పూర్తిగా తన కుడి కంటిని కోల్పోయాడు. కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ నిందితుడిపై నేరాభియోగం నిరూపితమవడంతో, ఆరు నెలల జైలు శిక్ష విధించింది. దీన్ని నిందితుడు అప్పీల్ కోర్ట్‌లో సవాల్ చేశాడు. ఈ క్రమంలో అతనికి మూడు నెలల జైలు శిక్ష 10,000 దిర్హామ్‌ల జరీమానా శిక్షగా విధించబడింది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు