యూఎస్ ఓపెన్ ప్రైజ్‌మనీ రూ. 26 కోట్లు
- July 20, 2018
యూఎస్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ గెలిస్తే 38 లక్షల డాలర్లు (రూ.26 కోట్లు) పొందవచ్చు. నిర్వాహకులు సింగిల్స్ విజేతలకు ఈ ఏడాది ప్రైజ్‌మనీని భారీగా పెంచారు. గ్రాండ్‌స్లామ్ టోర్నీల చరిత్రలో ఇదే అత్యధిక ప్రైజ్‌మనీ కావడం విశేషం. కేవలం మెయిన్ డ్రా కు అర్హత సాధిస్తే చాలు 54 వేల డాలర్లు ( రూ.37 లక్షలు) సొంతమవుతాయి. మొత్తం టోర్నీ ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా 5 కోట్ల 30 లక్షల డాలర్లు (రూ.363 కోట్లు). ఇది మొన్న సాకర్ విజేతకు ఇచ్చిన ప్రైజ్‌మనీ కంటే ఎక్కువ. గత మూడేళ్లుగా నగదు బహమతిని పెంచుతూ వచ్చామని అమెరికా టెన్నిస్ సంఘం చైర్మన్ కట్రినా ఆడమ్స్ తెలిపారు. పురుషులు, మహిళల సింగిల్స్ విజేతలకు సమాన ప్రైజ్‌మనీ ఇచ్చిన తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ కూడా యూఎస్ ఓపెన్. 1973 నుంచే సింగిల్స్ విజేతలకు ప్రైజ్‌మనీ సరిసమానం చేసిన చరిత్ర ఈ టోర్నీదే. వచ్చే నెల 27న మొదలయ్యే ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నికి ఈ ఏడాది స్వర్ణోత్సవ వేడుక కానుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..